ప్రశ్నించినందుకే Chandrababu Naidu అరెస్ట్: Parthasarathy

మాజీ ముఖ్యమంత్రి టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అరెస్ట్‌ను నిరసిస్తూ సత్యసాయి జిల్లా అధ్యక్షుడు ఇంచార్జి బికె. పార్థసారథి ఆధ్వర్యంలో పెనుకొండ అంబేద్కర్ సర్కిల్ వద్ద సామూహిక నిరాహార దీక్ష కొనసాగుతోంది...

Update: 2023-10-03 16:27 GMT
ప్రశ్నించినందుకే Chandrababu Naidu అరెస్ట్: Parthasarathy
  • whatsapp icon

దిశ, అనంతపురం ప్రతినిధి: మాజీ ముఖ్యమంత్రి టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అరెస్ట్‌ను నిరసిస్తూ సత్యసాయి జిల్లా అధ్యక్షుడు ఇంచార్జి బికె. పార్థసారథి ఆధ్వర్యంలో పెనుకొండ అంబేద్కర్ సర్కిల్ వద్ద సామూహిక నిరాహార దీక్ష కొనసాగుతోంది. చంద్రబాబుపై తప్పుడు కేసులు, అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. దేశం గర్వించే నేతను జైలులో పెట్టాలనే కక్ష్య తప్ప, ఎలాంటి కారణాలు, ఆధారాలు లేవని మండిపడ్డారు. లక్ష కోట్ల రూపాయలు  దోచేసి 16 నెలలు జైలులో ఉన్న వ్యక్తి Y.S జగన్ అని విమర్శించారు. అరాచక విధానాలతో అవినీతి బురదలో నిండా మునిగిన జగన్ ఆ బురదను అందరికీ అంటించేందుకు పన్నిన కుట్రలో భాగమే, ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసు అని కొట్టిపారేశారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ చంద్రబాబును అరెస్ట్ చేసి జైలులో పెట్టడం జగన్ నియంతృత్వ పోకడకు నిదర్శనమని ఎద్దేవా చేశారు. చంద్రబాబుని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

Tags:    

Similar News