‘తోటకు వెళ్లిన వ్యక్తి.. మూడు రోజులుగా వెతికినా దొరకని ఆచూకీ’.. తీరా చూస్తే అంతా షాక్!
రాష్ట్రంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. అనంతపురం జిల్లా(Anantapur District) ముచ్చుకోటకు చెందిన 80 ఏళ్ల పెద్ద శివయ్య అనే వృద్ధుడు మృత్యువును జయించాడు. వివరాల్లోకి వెళితే.. కొన్ని రోజుల క్రితం తోట వద్దకు వెళ్లిన పెద్ద శివయ్య మళ్లీ ఇంటికి తిరిగి రాలేదు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు ఆయన కోసం వెతకడం మొదలు పెట్టారు. అయిన ఆ వృద్ధుడి ఆచూకీ తెలియరాలేదు. అయితే పెద్ద శివయ్య ఉపాధి హామీ(Employment Guarantee)లో తవ్విన గుంతలో పడిపోయినట్లు స్థానికులు గుర్తించారు. మూడు రోజుల పాటు అతను నీరు, ఆహారం లేకపోవడంతో లేవలేని స్థితిలో పడి ఉన్నాడు. కుటుంబ సభ్యులు ఎంత వెతికినా కనిపించకపోవడంతో గ్రామస్థులతో కలిసి జల్లెడ పట్టారు. ఈ క్రమంలో గుంతలో ఉన్నట్లు గుర్తించగా ఇంటికి తీసుకురావడంతో కుటుంబ సభ్యులు ఊపిరిపీల్చుకున్నారు.