మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి నిరసన సెగ

అనంతపురం జిల్లా ఉరవకొండలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డికి నిరసన సెగ తగిలింది

Update: 2024-01-20 09:31 GMT
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి నిరసన సెగ
  • whatsapp icon

దిశ వెబ్ డెస్క్: అనంతపురం జిల్లా ఉరవకొండలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డికి నిరసన సెగ తగిలింది. ఈ నెల 23 న సీఎం జగన్ పర్యటన జరగనుంది. ఈ నేపధ్యంలో సభాస్ధలాన్ని పరిశీలించడానికి జిల్లా ఇన్‌చార్జిగా ఉన్న వైసీపీ నేత, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ఉరవకొండకు చేరుకున్నారు. ఈ క్రమంలో ఆయనను వెళ్ళనీయకుండా అంగన్వాడీ కార్యకర్తలు పెద్దిరెడ్డి కాన్వాయ్ ను అడ్డుకున్నారు. దాదాపు అరగంట సేపు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితి సద్దుమణిగే ప్రయత్నం చేసినా.. అంగన్వాడీలు కదలకపోవడంతో మహిళలని కూడా చూడకుండా బలవంతంగా ఈడ్చెకెళ్ళారు. ఈ ఘటనలో కొందరు అంగన్వాడీలు గాయపడ్డారు. అతి కష్టం మీద పోలీసులు మంత్రి వాహానాన్ని సభాస్థలి వద్దకు పంపించగలిగారు. 

Read More..

విశాఖ ఆర్థిక వ్యవస్థకు మూలం సముద్రం.. నిర్లక్ష్యం చేయడం బాధాకరం..  

Tags:    

Similar News