జేసీకి భయపడం.. మీటింగ్ పెడతా: అనంత వెంకటరామిరెడ్డి

అనంతపురం జిల్లా తాడిపత్రిలో రాజకీయం వేడెక్కింది...

Update: 2024-12-01 16:19 GMT
జేసీకి భయపడం.. మీటింగ్ పెడతా: అనంత వెంకటరామిరెడ్డి
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: అనంతపురం జిల్లా తాడిపత్రి(Tadipatri)లో రాజకీయం వేడెక్కింది. మాజీ ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి(Former MLA, Municipal Chairman JC Prabhakar Reddy), వైసీపీ నేత అనంత వెంకట్రామిరెడ్డి(YCP leader Anantha Venkatrami Reddy) మధ్య మాటల యుద్ధం పెరిగింది. తాడిపత్రిలో బయటవాళ్లను ఎవరిని అడుగుపెట్టనివ్వమని జేసీ హెచ్చరిస్తే కచ్చితంగా అక్కడి వెళ్తామని, మీటింగ్ పెడతామని వైసీపీ నేత అనంత వెంకటరామిరెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తాడిపత్రిలో తమకూ బలం ఉందని, జిల్లా అధ్యక్షుడిగా అక్కడ మీటింగ్ పెట్టి తీరతానని చెప్పారు. జేసీ ప్రభాకర్ రెడ్డికి భయపడేది లేదని, నిర్భయంగా మాట్లాడతానన్నారు. జిల్లాలో కొత్త మాఫియాను జేసీ తయారు చేయించి మాట్లాడిస్తున్నారని అనంతపురం వైయస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామి రెడ్డి వ్యాఖ్యానించారు. 

Tags:    

Similar News