AP:మంత్రి నారా లోకేష్ దృష్టికి..ప్రైవేట్ స్కూళ్ల సమస్యలు

ప్రైవేట్ స్కూళ్లు ఎదుర్కొంటున్న వివిధ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చారు.

Update: 2024-07-03 14:20 GMT

దిశ ప్రతినిధి,అనంతపురం:ప్రైవేట్ స్కూళ్లు ఎదుర్కొంటున్న వివిధ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ (ఏపీపీఎస్ఏ), అనంతపురం జిల్లా ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ నాయకులు విజయవాడలో బుధవారం లోకేష్‌ను కలిసి వినతి పత్రం సమర్పించారు. చిత్తూరు జిల్లా యువగళం పాద యాత్రలో ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో తాము కలిసిన సందర్భంగా ఇచ్చిన హామీని గుర్తు చేశారు. దీంతో లోకేష్ సానుకూలంగా స్పందించారు. వినతిపత్రాన్ని పరిశీలించిన అనంతరం నెలరోజుల్లో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం సంఘాల తరఫున అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏడీపీఎస్ఏ అధ్యక్షుడు రూట్స్ గోపాల్ రెడ్డి, సీఆర్ఓ రవి చంద్రారెడ్డి, నగర గౌరవాధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి, గౌరవ సలహాదారుడు రామాంజనేయులు, ముదిగుబ్బ పీవీఎస్ నాయుడు, బత్తలపల్లి లక్ష్మీనారాయణ, పెనుకొండ డివిజన్ నాయకుడు చిత్తయ్య తదితరులు పాల్గొన్నారు.


Similar News