అనంతపురం వైసీపీ కార్యాలయానికి నోటీసులు

అనంతపురం వైసీపీ కార్యాలయానికి అధికారులు నోటీసులిచ్చారు. ....

Update: 2024-06-22 17:11 GMT

దిశ ప్రతినిధి, అనంతపురం: అనంతపురం వైసీపీ కార్యాలయానికి అధికారులు నోటీసులిచ్చారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని శనివారం తెల్లవారుజామున కూల్చి వేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అనుమతులు లేకుండా నిర్మించారంటూ అనంతపురం హెచ్ఎల్సీ కాలనీలో వైసీపీ కార్యాలయానికి మున్సిపల్ అధికారులు నోటీసులిచ్చారు. ఏడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని, అలా ఇవ్వని పక్షంలో తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ మేరకు వైసీపీ జిల్లా అధ్యక్షుడి పేరుతో నోటీసులు ఇచ్చారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయ భవనం కూల్చివేతకు తోడు అటు విశాఖపట్నం, ఇటు అనంతపురం పార్టీ కార్యాలయాలకు నోటీసులి వ్వడం ఆ పార్టీ శ్రేణుల్లో కలకలం రేపుతోంది.


Similar News