స్వీప్ చేస్తాం.. సజ్జల సంచలన జోస్యం

ఎన్నికలు ఎప్పుడు వచ్చినా స్వీప్ చేస్తామని గత ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్టారెడ్డి అన్నారు..

Update: 2024-10-04 16:40 GMT

దిశ, వెబ్ డెస్క్: ఎన్నికలు ఎప్పుడు వచ్చినా స్వీప్ చేస్తామని వైసీపీ నేత, గత ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్టారెడ్డి(Ycp Leader Sajjala Ramakrishna Reddy) అన్నారు. ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా గ్రామ కమిటీలను పక్కగా నియమించినట్లు ఆయన తెలిపారు. భేదాభిప్రాయాలు పక్కన పెట్టి సీనియర్లందరం ఇప్పటి నుంచే కలిసి కట్టుగా పని చేస్తామని చెప్పారు. కూటమి నేతలు మోసపూరిత హామీలు ఇవ్వడంతోనే పార్టీ ఓడిపోయిందన్నారు. వైసీపీ ప్రభుత్వంలో రూ. 14 లక్షల కోట్ల అప్పు అంటూ టీడీపీ నేతలు అసత్య ప్రచారం చేశారని మండిపడ్డారు. వైసీపీ ఓటమి షాక్‌గా అనిపించినా రాజకీయాల్లో గెలుపోటములు సహజమని సజ్జల పేర్కొన్నారు. 

కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన వెంటనే అరాచకాలు మొదలు పెట్టిందని సజ్జల విమర్శించారు. వైఎస్ జగన్‌ను దెబ్బకొట్టాలని తిరుమల లడ్డూ వివాదాన్ని తెరపైకి తీసుకొచ్చారని, సుప్రీంకోర్టు(Supreme Court) మొట్టికాయలు వేసిందని ఎద్దేవా చేశారు. సనాతన ధర్మానికి తానే చంపియన్ అనే విధానంలో రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్(Deputy Cm Pawan Kalyan) తీసుకున్న లైన్ బీజేపీ(Bjp) పెద్దలకు నచ్చడం లేదని, వాళ్లలో వాళ్లే కొట్టుకునేలా ఉన్నారని సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.


Similar News