Kalyanadurgam: టీడీపీ నేత మారుతి చౌదరిపై కేసు
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి కుమారుడు మారుతి చౌదరిని పోలీసులు అరెస్ట్ చేశారు..
దిశ కళ్యాణదుర్గం: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి కుమారుడు మారుతి చౌదరిని పోలీసులు అరెస్ట్ చేశారు. శెట్టూరు మండలం లక్ష్మంపల్లిలో ఓ మహిళ ఇంట్లోకి ప్రవేశించి దురుసుగా ప్రవర్తించారన్న ఫిర్యాదుపై ఆయనపై కేసు నమోదు అయింది. అదే గ్రామంలోనే మరొక ఘటనపై మారుతి చౌదరిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. టీడీపీ నేత మారుతి చౌదరి మాట్లాడుతూ రైతులకు అందాల్సిన డ్రిప్ పైపులను వైసీపీ నేతలు కర్ణాటకకు అక్రమంగా తరలిస్తున్నారని, అడ్డుకునేందుకు వెళితే తమపై పోలీసులు కేసు నమోదు చేశారని వాపోయారు.