Breaking: తాడిపత్రిలో రోడ్ టెర్రర్.. ఇద్దరు స్పాట్ డెడ్

అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది...

Update: 2024-03-23 12:05 GMT
Breaking: తాడిపత్రిలో రోడ్ టెర్రర్.. ఇద్దరు స్పాట్ డెడ్
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తాడిపత్తి రహదారిలోని ఎస్‌ఆర్‌టీ కాలేజీ వద్ద ప్రైవేటు బస్సు ఇద్దరు వ్యక్తులను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతులు కడప జిల్లా వాసులుగా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. మృతుల కుటుంబాలకు సమాచారం అందజేశారు. స్థానిక ప్రమాదానికి కారణమైన బస్సు స్థానిక పీవీకేకే ఇంజినీరింగ్ కాలేజీకి చెందినదిగా పోలీసులకు స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read More..

AP Elections 2024: హీటెక్కిన కూటమి రాజకీయాలు..? ఆ నియోజకవర్గం బరిలో నిలిచేదెవరు..? 

Tags:    

Similar News