Anamthapuram: జూనియర్ కాలేజీలో విద్యార్థిని అనుమానాస్పద మృతి
కాలేజీలో విద్యార్థిని అనుమానాస్పదంగా మృతి(Deid) ఘటన అనంతపురం జిల్లా(Ananthapuram District)లో జరిగింది.
దిశ, వెబ్ డెస్క్: కాలేజీలో విద్యార్థిని అనుమానాస్పదంగా మృతి(Deid) ఘటన అనంతపురం జిల్లా(Ananthapuram District)లో జరిగింది. ఉరవకొండ(Uravakonda) మండలం, పాల్తూరు(Palthuru) గ్రామానికి చెందిన చిన్న తిప్పమ్మ అనే బాలిక అనంతపురంలోని ఓ జూనియర్ కాలేజీలో చదువుతోంది. ఆ బాలిక బుధవారం కాలేజీ హస్టల్ లో ఉరి వేసుకున్నది. దీనిపై మృతురాలి బంధువులు బాలిక ఆత్మహత్య కాదు హత్య అని ఆరోపిస్తున్నారు. అలాగే కాలేజీ యాజమాన్యం వేధింపుల వల్లే విద్యార్థిని ఉరి వేసుకుని మృతి చెందిందని కళాశాల ఎదుట ఆందోళనకు దిగారు. దీనిపై పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడతామని అన్నారు. ఇదిలా ఉండగా అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్ లో బాధితులతో కాలేజీ యాజమాన్యం సెటిల్మెంట్ చేసే యత్నం చేసినట్లు తెలుస్తోంది.