AP:ఏలూరు పర్యటనలో సీఎం చంద్రబాబుకు ఎదురైన ఆసక్తికర సన్నివేశం..ఏంటంటే?

సీఎం చంద్రబాబు నేడు(బుధవారం) వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ఈ నేపథ్యంలో వరద బాధితులను సీఎం పరామర్శించారు.

Update: 2024-09-11 13:58 GMT

దిశ,వెబ్‌డెస్క్:సీఎం చంద్రబాబు నేడు(బుధవారం) వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ఈ నేపథ్యంలో వరద బాధితులను సీఎం పరామర్శించారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబుకు ఒక ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. సీఎం చంద్రబాబు(CM Chandrababu) పై ఓ యువతి అభిమానం చాటుకున్నారు. ఏలూరు జిల్లాలో వరదల(Floods)పై సీఎం సమీక్షకు హాజరైన ఆమె సర్ నాకు లోకేష్(Nara Lokesh) అన్నయ్య అంటే చాలా ఇష్టం అని చెప్పారు. ఆయన పై రెండు పాటలు, ఒక బుక్(Book) రాశా అని చెప్పింది. మీ పైన ఒక పాట రాశాను సర్ ఒకసారి పాడటానికి అవకాశం ఇవ్వండి అని కోరారు. దీంతో సీఎం అనుమతి ఇవ్వడంతో చంద్రబాబు పై “చంద్రుడ మా చంద్రుడ నిరంతరం రావాలి” అంటూ భజన పాట పాడింది. ఈ పాటలో చంద్రబాబు నిరంతరం ప్రజల కోసం పాటు పడుతారని..ప్రజల మేలు కోరుతాడని స్పష్టంగా వెల్లడించింది. తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందడానికి చంద్రబాబు కృషి చాలా ఉందని వెల్లడించారు. పాడిన కొద్ది క్షణాల్లోనే సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రజెంట్ ఈ సాంగ్ తెగ వైరల్ అవుతోంది.


Similar News