దారుణం.. కొడుకును చంపి పొరపాటున జరిగిందన్న తండ్రి
కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో దారుణం జరిగింది...
దిశ, వెబ్ డెస్క్: కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో దారుణం జరిగింది. వేంపల్లి రాజీవ్ నగర్ కాలనీలో నివాసముంటున్న సురేశ్ మద్యానికి బానిసగా మారాడు. తరచూ మద్యం తాగి వచ్చి మూగ అయిన భార్యను వేధించేవారు. వీరికి ఏడాది బాలుడు ఉన్నారు. అయితే ప్రతి రోజూ మాదిరిగానే సురేశ్ మద్యం తాగి ఇంటికి వెళ్లాడు. అయితే మంచంపై నిద్రిస్తున్న కుమారుడిని గొంతనులిమి చంపేశాడు. అనంతరం ఆ నిందను భార్యపై వేసే ప్రయత్నం చేశారు. తాను బాలుడిని చంపుతున్న సమయంలో తన భార్య ఉంట్లోనే ఉందని తెలిపారు. చివరకు తన కుమారుడిని తానే గొంతు నులిమి చంపానని సురేశ్ తెలిపారు. పొరపాటున జరిగిందని చెప్పారు. దీంతో సురేశ్‌పై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. కన్న కొడుకును చంపిన కసాయి తండ్రి సురేశ్ అంటూ స్థానికులు మండిపడుతున్నారు. అభం శుభం తెలియని పసి బాలుడి ప్రాణం తీసిన నిందితుడు సురేశ్‌ను అసలు వదిలిపెట్టొద్దని, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.