అన్నమయ్య జిల్లాలో దారుణం... మాజీ జడ్జి ఇంటిపై దాడి
అన్నమయ్య జిల్లా బి. కొత్తకోటలో దారుణం జరిగింది...
దిశ, వెబ్ డెస్క్: అన్నమయ్య జిల్లా బి. కొత్తకోటలో దారుణం జరిగింది. మాజీ జడ్జి రామకృష్ణ ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. వేటకొడవళ్లతో అర్ధరాత్రి ఇంటిలోకి ప్రవేశించి, కిటికీలు, కారు అద్ధాలు ధ్వంసం చేశారు. అయితే గతంలోనూ రామకృష్ణ ఇంటిపై దాడి జరిగింది. ఆ దాడిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల హస్తం ఉందని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోర్టుకు సైతం వెళ్లారు. ఇప్పుడు కూడా వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణులే చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.