దారుణం.. జీతం అడిగినందుకు మహిళపై దాడి

అన్నమయ్య జిల్లాలో దారుణం జరిగింది....

Update: 2024-08-12 16:37 GMT

దిశ, వెబ్ డెస్క్: అన్నమయ్య జిల్లాలో దారుణం జరిగింది. రైల్వే కోడూరు మండలం అనంతరాజుపేటలో ఓ హోటల్ యజమాని దాష్టీకానికి పాల్పడ్డారు. తమ వద్ద పని చేస్తున్న మహిళపై దాడికి పాల్పడ్డారు. గదిలో బంధించి విచక్షణారహితంగా కొట్టారు. జీతం అడిగితే చంపేస్తామని బెదిరించారు. యజమాని టార్చర్ తట్టుకోలేక పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. మహిళకు అండగా బంధువులు ఆందోళనకు దిగారు. హోటల్ యజమానిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో నిరసనను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.  జీతం ఇవ్వాల్సిన సమయం గడిచిపోయిందని, కొన్ని రోజులుగా ఇవ్వకుండా కావాలనే ఆలస్యం చేస్తున్నారని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గట్టిగా నిలదీయడంతో తనపై హోటల్ యజమాని దాడి చేశారని ఆమె పేర్కొన్నారు. 

Tags:    

Similar News