ఏపీ సర్కార్ నిర్ణయంపై హైకోర్టుకు మాజీ మంత్రి అంబటి రాంబాబు

వైసీపీ ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వం తనకు గన్‌మెన్లను తొలగిస్తూ చంద్రబాబు ప్రభుత్వం

Update: 2024-07-04 16:05 GMT

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. తనకు గన్‌మెన్లను తొలగిస్తూ చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆయన హై కోర్టులో సవాల్ చేశారు. ఈ మేరకు అంబటి తరుఫున ఆయన న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. మొన్నటి వరకు మంత్రిగా పని చేసిన అంబటి రాంబాబు గతంలో దాడులు జరిగాయని.. ఆయనకు ప్రత్యర్థుల నుండి ముప్పు ఉందని ఆయన తరుఫు లాయర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో అంబటి రాంబాబుపై జరిగిన దాడులకు సంబంధించిన వివరాలు సమర్పించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఈ నేపథ్యంలో వివరాలు అందించేందుకు ప్రభుత్వ తరుఫు న్యాయవాది సమయం కోరారు. దీంతో ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను న్యాయస్థానం ఈ నెల 10వ తేదీకి వాయిదా వేసింది. కాగా, ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి పాలైన విషయం తెలిసిందే. జగన్ కేబినెట్‌లో మంత్రిగా పని చేసిన అంబటి.. ఈ సారి తన సొంత నియోజకవర్గం సత్తెనపల్లిలో టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ చేతిలో ఓటమి పాలయ్యారు. ఈ క్రమంలోనే ఇటీవల రాష్ట్రంలో కొలువుదీరిన బాబు సర్కార్.. మాజీ మంత్రి అంబటి రాంబాబుకు గన్ మెన్లను తొలగించింది. తాజాగా దీనిపై ఆయన హైకోర్టును ఆశ్రయించారు. 


Similar News