టీడీపీ ఓటమి.. వైసీపీ విజయం ఖాయం.. అంబటి రాంబాబు
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు వాడివేడితో సాగుతున్నాయి.
దిశ వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు వాడివేడితో సాగుతున్నాయి. ప్రచారాలతో బిజీ గా ఉన్న పార్టీ నేతలు.. ప్రతిపక్ష పార్టీలపై విమర్శల జల్లు కురిపిస్తున్నారు. తాజాగా పల్నాడు జిల్లా సత్తెనపల్లి వైసీపీ కార్యాలయంలో మాట్లాడిన మంత్రి అంబటి రాంబాబు టీడీపీ అధినేత నారా చంద్రబాబుని దుమ్మెతిపోశారు. అసలు చంద్రబాబుకి ప్రజాస్వామ్యం పైన నమ్మకమే లేదని పేర్కొన్న ఆయన.. చంద్రబాబు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో ఎమ్మెల్సీని కొనటానికి ప్రయత్నించిన వ్యక్తి చంద్రబాబు అని ఆరోపించారు. ఇక ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలు నిర్వహిస్తే టీడీపీ ఓడిపోవడం ఖాయమని పేర్కొన్నారు.
జగన్ ని అన్ని వర్గాల ప్రజలు వాళ్ళ గుండెల్లో పెట్టుకున్నారని.. కనుక తమకు దొంగ ఓట్లతో పని లేదని స్పష్టం చేశారు. గతంలో ఈవీఎంలు పని చేయవని చెప్పిన చంద్రబాబు.. ఇప్పుడు ఓడిపోతానేమో అనే భయంతోనే వేషాలు వేస్తున్నారని.. ఎవరెన్ని కుట్రలు పన్నిన చివరికి గెలిచేది వైసీపీనే అని ధీమా వ్యక్తం చేశారు. కాగా విజయవాడలో కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహించిన సమావేశానికి టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కూడా హాజరయ్యారు. ఈ నాపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో ఓట్ల అక్రమాలు జరుగుతున్నాయని సీఈసీకి ఫిర్యాదు చేశారు. దొంగ ఓట్లు వేసుకుంటే తప్ప గెలవలేం అనే తుది నిర్ణయానికి వైసీపీ ప్రభుత్వం వచ్చిందని చంద్రబాబు ఆరోపించారు.