Amaravati : మాజీ సీఎం జగన్‌పై మంత్రి కొల్లు రవీంద్ర సెటైర్లు

ఏపీ మాజీ సీఎం జగన్, తనకు ప్రాణహాని ఉందని , కావాలనే వ్యక్తిగత భద్రత సిబ్బందిని తగ్గించారని హైకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే

Update: 2024-08-06 11:27 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీ మాజీ సీఎం జగన్ తనకు ప్రాణహాని ఉందని , కావాలనే వ్యక్తిగత భద్రత సిబ్బందిని తగ్గించారని హైకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. తనకు తగినంత భద్రత కలిపించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని హైకోర్టును ఆశ్రయించారు. జగన్ హైకోర్టును ఆశ్రయించడం పట్ల ఏపీ గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. కేవలం ఎమ్మెల్యేయిన జగన్ కు సీఎం తరహాలో భద్రత ఉండదని, జగన్ కు హై సెక్యూరిటీ ఇవ్వడానికి అతను ఏమయినా పీఎం,సీఎం కాదు, అందరిలాగే అతను ఒక సాధారణ ఎమ్మెల్యే అని ఎద్దేవా వేశారు.

ఈ రోజు అమరావతిలో కొల్లు రవీంద్ర మీడియాతో మాట్లాడూతూ.. 'ఆంధ్రప్రదేశ్ లో ఎవరు చనిపోయిన గద్దల వాలడానికి జగన్ వస్తున్నాడని విమర్శించారు. జగన్ 5 ఏళ్లు ఈ రాష్ట్రాన్ని రాబందులా పీక్కుతిన్నాడని, సీఎం చంద్రబాబు చేసే అభివృద్ధిని చూసి జగన్ తట్టుకోలేక పోతున్నాడని తెలిపారు. పాపాలు చేసిన వాళ్ళు ఎక్కడున్నా పోలీసులు వెతుకొచ్చి మరి దోషులుగా నిలబెడుతారని, రెడ్ బుక్ పేరు వింటేనే వైసీపీ నేతలు వణికిపోతున్నారని' విమర్శించారు. అలాగే సుపరిపాలన కోసం వాట్సాప్ గ్రూపులు పెడితే దాన్ని కూడా పేర్ని నాని విమర్శిస్తున్నారని, వంశీ, కొడాలి నానిలను పేర్ని నానినే ఎక్కడో దాచిపెట్టి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. 


Similar News