ఆడవాళ్లను నమ్ముకుంటే అంతే.. జగన్‌కు మద్యం ప్రియుడు అదిరిపోయే అడ్వైస్

ఏపీలో వైసీపీ ఘోర పరాభవం తర్వాత ఒక్కొక్కరు ఓటమికి ఓక్కో కారణం చెబుతున్నారు.

Update: 2024-06-10 06:46 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో వైసీపీ ఘోర పరాభవం తర్వాత ఒక్కొక్కరు ఓటమికి ఒక్కో కారణం చెబుతున్నారు. కొంత మంది రాజధాని, మరికొంత మంది కీలక నేతల నోటి దురుసు వల్లే ఓడిపోయాం అని అంచనాలు వేస్తున్నారు. కాగా, తాజాగా ఓ మద్యం ప్రియుడు చెప్పిన లాజిక్ నెట్టింట వైరల్ అవుతోంది. ‘జగనన్న ఏపీలో నా చెల్లెమ్మలు ఓటేస్తారని అమ్మఒడి, చేయూత, చేదోడు, పాప నేస్తం ఇచ్చిన చివరకు మహిళలు ఓటమి ఇచ్చారని.. అదే మా మగవాళ్లకు మంచి మందు ఇచ్చి ఉంటే.. ఓడిపోయినా కనీసం 40-50 సీట్లు ఇచ్చుండేవాళ్లం అని చెప్పాడు. ఆడవాళ్లను నమ్మడం వల్లే జగన్ 10 సీట్లతో మిగిలిపోయాడని సదరు వ్యక్తి తెలిపాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Similar News