ఏఐ పాలిటిక్స్..! ఏపీ లీడర్స్ మార్ఫింగ్ వీడియోలు వైరల్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీ వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో మార్ఫింగ్ వీడియోలు, ఫోటోలు విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి.
దిశ, డైనమిక్ బ్యూరో: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీ వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో ఇతరుల మార్ఫింగ్ వీడియోలు, ఫోటోలు విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవల ప్రముఖ నటి రష్మీక డీప్ ఫేక్ వీడియోపై దేశవ్యాప్తంగా చర్చ జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కొందరు ఆకతాయిలు రాజకీయ నాయకుల వీడియోలను ఏఐ టెక్నాలజీ ఉపయోగించి మార్ఫింగ్ వీడియోలు చేస్తున్నారు. తాజాగా ఏపీలో ఎన్నికల జరుగనున్న క్రమంలో ప్రతిపక్ష నేతలపై చేసిన మార్ఫింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
అయితే ఇటీవల ఓ చిన్నారుల వీడియో సోషల్ మీడియాలో పాపులర్ అయ్యింది. ‘ఆపిల్ ఆపిల్ రెడ్ రెడ్ ఆపిల్’ అని అంటూ చిన్నారులు ఇంగ్లిష్‌లో పండ్ల గురించి చెబుతూ డ్యాన్స్ చేస్తుంటారు. ఆ వీడియోను కొందరూ ఆకతాయిలు టెక్నాలజీ ఉపయోగించి మార్ఫింగ్‌లు చేస్తున్నారు. మొదట ప్రముఖ హీరోయిన్లు, హీరోల ఫేస్‌లను పెట్టి.. ఆ వీడియోను వైరల్ చేశారు. తాజాగా ఏపీ లీడర్స్ ఫేస్‌లను ఉపయోగించి మార్ఫింగ్ వీడియో క్రియేట్ చేశారు. దీంతో ఆ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కాగా, ఈ ఏఐ టెక్నాలజీ వల్ల ప్రజలకు మంచి జరగనుందా? లేక హనీ జరగనుందా? అనే చర్చ కూడా ప్రపంచవ్యాప్తంగా నడుస్తోంది.