Aghori's : అఘోరీ‌ కారుకు ప్రమాదం..శ్రీకాళహస్తి సమీపంలో ఘటన

సనాతన ధర్మ పరిరక్షణ పేరుతో తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తు జనాల్లో చర్చనీయాంశంగా మారిన మహిళా అఘోరీ(Aghori's) తృటిలో రోడ్డు ప్రమాదం నుంచి తప్పించుకున్నారు

Update: 2024-11-08 05:41 GMT

దిశ, వెబ్ డెస్క్ : సనాతన ధర్మ పరిరక్షణ పేరుతో తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తు జనాల్లో చర్చనీయాంశంగా మారిన మహిళా అఘోరీ(Aghori's) తృటిలో రోడ్డు ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. అఘోరి ప్రయాణిస్తున్న కారు ఏపీ(AP)లోని శ్రీకాళహస్తి వద్ద ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో రోడ్దు డివైడర్ కు అఘోరీ కారు ఢీకొనడంతో కారు ముందు భాగం కొంత మేరకు ధ్వంసమైంది. ప్రమాదంపై అఘోరీ స్పందిస్తూ.. తనకు ఏమీ కాలేదని, తాను క్షేమంగానే ఉన్నానని తెలిపింది. తన కారుకు లైట్లు వెలగడం లేదని, మెకానిక్ వచ్చే వరకు ఆగాలని చెప్పినప్పటికి పోలీసులు వినిపించుకోకుండా తనను వెళ్ళిపోమని బలవంతం చేశారని, ప్రమాదానికి పోలీసులే బాధ్యత వహించాలన్నారు. శ్రీకాళహస్తి నుంచి విజయవాడకు వెలుతుండగా ఈ ప్రమాదం జరిగిందని అఘోరి తెలిపారు.

అఘోరీ అంతకుముందు శ్రీకాళహస్తిలో మహాశివుడిని తనుదిగంబరంగా దర్శించుకునే ప్రయత్నం చేయగా, ఆలయ అధికారులు అనుమతించలేదు. దీంతో ఆమె వారితో వాగ్వివాదానికి దిగడం, ఆత్మార్పణ యత్నం చేయడం వివాస్పదమైంది. చివరకు నాగశక్తి పీఠాధిపతి సూచనతో వస్త్రాన్ని కప్పుకుని దర్శన ప్రక్రియ పూర్తి చేసుకున్నారు. 

Read More : కీలక పరిణామం.. ఎర్రటి దుస్తులు ధరించి శ్రీకాళహస్తీ ఆలయంలోకి వెళ్లిన మహిళా అఘోరి 

Tags:    

Similar News