రాజకీయాల్లో దుమారం రేపుతోన్న నటి జైత్వానీ కేసు.. నేడు విజయవాడలో ఉన్నాధికారుల పర్యవేక్షణలో స్టేట్‌మెంట్ రికార్డ్
ఏకంగా సీనియర్ ఐపీఎస్‌లనే టచ్ చేసిన నటి జైత్వానీ కేసుపై ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది.
దిశ, వెబ్‌డెస్క్: ఏకంగా సీనియర్ ఐపీఎస్‌లనే టచ్ చేసిన నటి జైత్వానీ కేసుపై ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఈ కేసు రాజకీయంగానూ దుమారం రేపుతోంది. ముంబై నటి జైత్వానీ నేడు విజయవాడకు వెళ్తున్నారు. గతంలో ఏపీ పోలీసులు వేధించారని జైత్వానీ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. తనపై ఏపీ పోలీసులు అక్రమ కేసులు పెట్టారని, వేధించిన అధికారులు వివరాలు నా దగ్గర ఉన్నాయని తెలిపారు. ఆమె కుటుంబ సభ్యులను కూడా ఇబ్బందులకు గురి చేశారని అన్నారు. తన దగ్గర ఉన్న ఆధారాలన్నీ ఏపీ ప్రభుత్వానికీ ఇస్తానని వెల్లడించారు. ఏపీ ప్రభుత్వం న్యాయం చేస్తుందన్న నమ్మకం ఉందన్నారు నటి జైత్వానీ.
అయితే నిన్న ముంబై నుంచి హైదరాబాదు చేరుకున్న ఇవాళ విజయవాడకు వెళ్తున్నారు. విజయవాడ పోలీసులకు కలిసి తనపై జరిగిన వేధింపులు, ఇతర విషయాలు అన్ని కూడా డిటెయిల్డ్‌గా వివరించబోతున్నారు. లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దీంతో కొంతమంది రాజకీయ నేతలు, ఐపీఎస్ అధికారులపై కూడా కేసులు నమోదు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ నటి విజయవాడ పోలీసుల రక్షణలో ఉంది. మరికాసేపట్లో అధికారి స్రవంతి రాయ్ .. నటి జైత్వానీ స్టేట్‌మెంట్ రికార్డ్ చేయనున్నారు. ఉన్నాధికారుల పర్యవేక్షణలో దర్యాప్తు కొనసాగనుంది. ఇప్పటికే ముగ్గురు ఐపీఎస్ లపై ప్రభుత్వానికి ఫిర్యాదులు చేసిన సంగతి తెలిసిందే.