పొలిటికల్ ఎంట్రీపై సినీ నటుడు సుమన్ క్లారిటీ.. ఎన్నికల వేళ ఓటర్లకు కీలక పిలుపు
ఏపీ ఎన్నికల నేపథ్యంలో సినీ నటుడు సుమన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల తర్వాత చాలా మార్పులు వస్తాయని అందుకే ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని సూచించారు.
దిశ, వెబ్‌డెస్క్: ఏపీ ఎన్నికల నేపథ్యంలో సినీ నటుడు సుమన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల తర్వాత చాలా మార్పులు వస్తాయని అందుకే ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని సూచించారు. రాజకీయ నాయకులను అవినీతిపరులను చేసింది ప్రజలే అని ఆయన అన్నారు. అన్ని పార్టీల నాయకుల వద్ద డబ్బులు తీసుకుని తమకు ఇష్టమైన వారికి ఓటు వేస్తున్నారు.కానీ ఎన్నికల ఫలితాల తర్వాత చాలా మార్పులు వస్తాయి. ఐదేళ్లు బాగుండాలి అంటే ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని సూచించారు. ఇక రాజకీయాల్లోకి రావడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. తను సమాజ సేవలోనే ఉంటానని తెలిపారు. ఈ క్రమంలోనే సుమన్ ఏపీ రాజకీయాలు తనకు అవసరం లేదన్నాడు. తాను తెలంగాణలో ఉంటున్నా అని తేల్చి చెప్పారు.