Ramoji Rao : రామోజీ రావు లేరంటే అస్సలు నమ్మలేక పోతున్నా: యాక్టర్ మోహన్ బాబు
రామోజీ సంస్థల అధినేత, మీడియా దిగ్గజం రామోజీ మృతిపై టాలీవుడ్ సీనియర్ యాక్టర్ మోహన్ బాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
దిశ, వెబ్‌డెస్క్: రామోజీ సంస్థల అధినేత, మీడియా దిగ్గజం రామోజీ మృతిపై టాలీవుడ్ సీనియర్ యాక్టర్ మోహన్ బాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రామోజీ రావు ఒక మహోన్నతమైన వ్యక్తి అని, ఆయన మన మధ్య లేరంటే అస్సలు నమ్మలేకపోతున్నానని ఎమోషనల్ కామెంట్స్ చేశారు. పత్రిక రంగంలో ఆయన రారాజుగా వెలుగొందారని కొనియాడారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఫిల్మ్ సిటీని (రామోజీ ఫిల్మ్ సిటీ) నిర్మించారని ప్రశంసించారు. సినీ, మీడియా పరిశ్రమకు ఆయన మృతి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. రామోజీ రావు ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తున్నానని అన్నారు. కాగా, అనారోగ్యం కారణంగా ఇవాళ తెల్లవారుజూమున రామోజీ రావు మృతి చెందిన విషయం తెలిసిందే. రామోజీ ఫిల్మ్ సిటీలోని ఆయన పార్థివదేహానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ఆదివారం అధికారిక లాంఛనాలతో రామోజీ రావు అంత్యక్రియలు రామోజీ ఫిల్మ్ సిటీలో జరగనున్నాయి.