Deputy CM Pawan:‘బాధ్యులపై చర్యలు తీసుకుంటాం’.. డిప్యూటీ సీఎం పవన్ సంచలన వ్యాఖ్యలు

ఏపీలో నేడు(శుక్రవారం) 10వ రోజు అసెంబ్లీ సమావేశాలు(Assembly Meetings) కొనసాగుతున్నాయి.

Update: 2024-11-22 05:24 GMT

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో నేడు(శుక్రవారం) 10వ రోజు అసెంబ్లీ సమావేశాలు(Assembly Meetings) కొనసాగుతున్నాయి. ఉదయం 10 గంటలకు శాసన మండలి సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇక అసెంబ్లీలో ఈరోజు పీఏసీ కమిటీకి ఎన్నిక జరుగనుంది. ఈ క్రమంలో అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో మాట్లాడుతూ గత ప్రభుత్వం పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) నిప్పులు చెరిగారు. అసెంబ్లీలో సభ్యులు చెప్పిన విషయాలను నోట్ చేసుకున్నామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. గత ప్రభుత్వం రూ.13 వేల కోట్లు దారి మళ్లించిందని పవన్ కళ్యాణ్ ఫైరయ్యారు. ఈ అంశంపై లోతైన విచారణ చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. జాబ్ కార్డుల్లో అవకతవకలపై చర్యలు తీసుకుంటామని పవన్ కల్యాణ్ చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పనులు చేయకుండా నిధులు వినియోగించారని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. ఈ నేపథ్యంలో బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. అయితే ఇటీవల ఎన్డీయే కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన పల్లె పండుగ కార్యక్రమం పై ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రూ.4,500 కోట్లతో గ్రామసభలు నిర్వహిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోందన్నారు. ఈ నేపథ్యంలో ఏపీలో పల్లె పండుగ కార్యక్రమం కొనసాగుతోందని డిప్యూటీ సీఎం పవన్ స్పష్టం చేశారు.

Tags:    

Similar News