Politics: అంబటి రాయుడు రాజీనామా పై అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు..

ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు కొన్ని రోజుల క్రితం వైసీపీ గూటికి చేరారు.

Update: 2024-01-07 07:53 GMT

దిశ వెబ్ డెస్క్: ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు కొన్ని రోజుల క్రితం వైసీపీ గూటికి చేరారు. అయితే అనూహ్యంగా ఎవరు ఊహించని రీతిలో పార్టీ లో చేరిన 10 రోజుల్లోనే పార్టీకి రాజీనామా చేసి వైసిపికి గుడ్ బై చెప్పారు. దీనితో ప్రస్తుతం రాయుడి రాజీనామా చర్చనీయాంశంగా మారింది. ప్రతిపక్ష నేతలే కాకుండా కొందరు వైసీపీ నేతలు కూడా ఈ విష్యం పైన స్పందిస్తున్నారు. తాజాగా అచ్చెన్నాయుడు కూడా అంబటి రాయుడు రాజీనామా పైన సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియాతో మాట్లాడిన ఆయన.. వైసీపీ తీర్ధం పుచ్చుకున్న 5 రోజుల్లోనే అంబటి రాయుడిని డకౌట్ చేశారని ఎద్దేవా చేశారు.

వైసిపి లోని చాలామంది హేమాహేమీలు పార్టీని వీడనున్నారని.. వాళ్లంతా టీడీపీ ని సంప్రదిస్తున్నారని పేర్కొన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ లో వైసిపికి భవితవ్యం లేదని తెలిపిన ఆయన.. రాబోయే ఎన్నకల్లో వైసీపీకి ఇది స్ఫష్టంగా తెలుస్తుంది అన్నారు. ఏదేమైనా అంబటి రాయుడు రాజీనామాతో వైసీపీ ప్రతిపక్షాలు విమర్శించేందుకు ఓ అవకాశం ఇచ్చినట్లయింది రాజకీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తపరుస్తున్నారు. 

Tags:    

Similar News