ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. బాలుడి పరిస్థితి విషమం

ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం తోకపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది....

Update: 2024-07-11 11:34 GMT

దిశ, వెబ్ డెస్క్: ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం తోకపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బాలుడి పరిస్థితి విషమంగా ఉంది. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని అంచనా వేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Similar News