Breaking: నెల్లూరులో ఏసీబీ రైడ్స్.. కీలక ఫైళ్లు స్వాధీనం
నెల్లూరులో ఏసీబీ రైడ్స్ కలకలం రేగింది. ..
దిశ, వెబ్ డెస్క్: నెల్లూరులో ఏసీబీ రైడ్స్ కలకలం రేగింది. సెలైంట్‌గా మైనింగ్ కార్యాలయంపై దాడులు నిర్వహించారు. పలు ఫైళ్లను, పత్రాలను పరిశీలించి అధికారులను ప్రశ్నించారు. మైనింగ్‌కు సంబంధించిన లావాదేవీలపై ఆరా తీశారు. మైనింగ్ కార్యాలయంలో అవినీతి, అక్రమాలు జరిగినట్లు ఏసీబీ దృష్టికి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ మేరకు అధికారులు రైడ్స్ నిర్వహిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం మైనింగ్ కార్యాలయంలో సోదాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలు కీలక ఫైళ్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గత ప్రభుత్వ నేతల ప్రమేయంపైనా ఆరా తీస్తున్నారు. అక్రమాలు జరిగినట్లు తేలితే పలువురు అధికారులతో పాటు నేతలపైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.