శ్రీశైలం దేవస్థానం నూతన ఈవోగా డిప్యూటీ కలెక్టర్
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం.. అన్ని రంగాల్లో సమూల మార్పులు చేస్తోంది.
దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం.. అన్ని రంగాల్లో సమూల మార్పులు చేస్తోంది. ఈ క్రమంలో గత ప్రభుత్వం సమయంలో వివక్షకు గురైన ఎండోమెంట్ శాఖ పై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ క్రమంలో రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ప్రక్షాళన చేపట్టింది. ఇందులో భాగంగా కొద్ది రోజుల క్రీతమే.. టీటీడీ చైర్మన్ ను నియమించింది. అలాగే ముఖ్యమైన ఆలయాల్లోని అధికారుల అవినీతిపై చర్యలు తీసుకొని కొత్త ఈవోలను నియమిస్తూ వస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా శ్రీశైలం దేవస్థానం ఈవోను కూడా ప్రభుత్వం మార్చింది. కాగా ప్రస్తుతం శ్రీశైలం నూతన ఈవోగా.. డిప్యూటీ కలెక్టర్ ఎం శ్రీనివాసరావును ప్రభుత్వం నిర్ణయించింది. ఆయన ఈ బాధ్యతల్లో ఏడాది కాలం పాటు కొనసాగనున్నారు. శ్రీనివాసరావును ప్రభుత్వం.. డిప్యూటేషన్ పై ఈవోగా తీసుకరావడం విశేషం.