ముంబై నటిపై కేసులో ఇద్దరు ఐపీఎస్‌లకు బిగుస్తున్న ఉచ్చు.. త్వరలో నోటీసులు..!

ముంబై నటిపై కేసులో ఇద్దరు ఐపీఎస్‌లకు బిగుస్తున్న ఉచ్చు బిగుస్తోంది....

Update: 2024-08-27 17:23 GMT

దిశ, వెబ్ డెస్క్: ముంబై నటిపై కేసులో ఇద్దరు ఐపీఎస్‌లకు బిగుస్తున్న ఉచ్చు బిగుస్తోంది. త్వరలో వారికి నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. ఎన్నికలకు ముందు ముంబైకు చెందిన నటిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు విద్యాసాగర్ ప్రేమ పేరుతో మోసం చేశారు. దీంతో తనను పెళ్లి చేసుకోవాలని విద్యాసాగర్‌ను ముంబై నటి నిలదీసింది. అందుకు సదరు నాయకుడు ఒప్పుకోలేదు. దీంతో ఆమె ముంబైలో కేసు పెట్టారు. అయితే విద్యాసాగర్ ఏపీలో తన అధికార బలాన్ని ప్రయోగించారు. అప్పటి ప్రభుత్వం పెద్దలు, ఇద్దరు ఐపీఎస్‌ల అండతో ముంబై నటిపై విజయవాడ ఇబ్రహీంపట్నంలో కేసు నమోదు చేయించింది. వెంటనే ముంబై వెళ్లి నటితో పాటు ఆమె తల్లిదండ్రులను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. అయితే ఈ వ్యవహారంలో అప్పటి ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి, నాటి విజయవాడ సీపీ కాంతి రాణా టాటా, డీసీపీ విశాల్ గున్నీ కీలకంగా వ్యహరించారని ఆరోపణలు వచ్చాయి. అయితే ఎన్నికలు రావడంతో ఈ ఇష్యూపై ఎవరూ పెద్దగా ఫోకస్ పెట్టలేదు.

అయితే జగన్ హయాంలో పెట్టిన రివర్స్ కేసులపై ప్రస్తుత కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టింది. ముంబై నటిని వైసీపీ నాయకుడు విద్యాసాగర్ మోసం చేయడంతో పాటు అక్రమంగా రివర్స్ కేసు పెట్టడాన్ని సీరియస్‌గా తీసుకుంది. ముంబై నటిని, ఆమె కుటుంబంపై అప్పట్లో కేసు పెట్టి వేధించినట్లు గుర్తించింది. ఈ వ్యవహారంలో ఇద్దరు ఐపీఎస్ అధికారులు కాంతి రాణా టాటా, విశాల్ గున్నీపై ఆరా తీసింది. ఇద్దరు పాత్రలపై వివరాలు కోరింది. వీరిద్దరికి సంజాయిషీ నోటిసులివ్వాలని నిర్ణయించింది. అటు ముంబైలో నమోదైన కేసుకు సంబంధించిన వివరాలను రాష్ట్ర పోలీసుల ద్వారా సేకరిస్తోంది. ఇందులో భాగంగా వైసీపీ నాయకుడు విద్యాసాగర్‌తో పాటు, అప్పటి ప్రభుత్వ సలహాదారు సజ్జల పాత్రపైనా పోలీసులు ఆరా తీస్తున్నారు.

Tags:    

Similar News