అబుదాబిలో నరకం చూస్తున్న తెలుగు మహిళ.. కాపాడాలంటూ ప్రభుత్వానికి వినతి

ఉపాధి కోసం అబుదాబికి వెళ్ళి అక్కడి యాజమానుల చేతిలో నరకం చూస్తోంది ఓ ఏపీ మహిళ.

Update: 2024-08-05 15:10 GMT

దిశ, వెబ్ డెస్క్ : ఉపాధి కోసం అబుదాబికి వెళ్ళి అక్కడి యాజమానుల చేతిలో నరకం చూస్తోంది ఓ ఏపీ మహిళ. 'ఏడుస్తూ.. దయచేసి నన్ను కాపాడండి' అంటూ సెల్ఫీ వీడియోను సోషల్ మీడియాతో పంచుకుంది. వివరాల్లోకి వెళితే.. అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం లంక గ్రామానికి చెందిన కాశీ జ్యోతి అనే మహిళ ఆర్థిక ఇబ్బందులతో, అబుదాబిలో పనిచేస్తే ఎక్కువ జీతం వస్తుందని చెప్పిన ఏజెంట్ మాయ మాటలు నమ్మి నాలుగు నెలల క్రితం అప్పు చేసి మరీ అక్కడికి వెళ్ళింది. తీరా అక్కడికి వెళ్ళాక పని చేస్తున్న ఇంట్లో యాజమాన్యం తనని హింసిస్తుండటం, ఇంట్లో పని అంతా ఒక్కదానితోనే చేయించడం, సరిగా తిండి పెట్టక పోవడం వంటివి చూసి ఏం చేయాలో దిక్కు తోచని స్థితిలో పడిపోయింది. రహస్యంగా ఓ సెల్ఫీ వీడియోను చిత్రీకరిస్తూ.. తన ఆరోగ్యం పూర్తిగా పాడయిందని, కనీసం మందులు కూడా ఇప్పించడం లేదని, నిద్రపోయేందుకు కూడా సమయం ఇవ్వడం లేదంటూ కన్నీళ్ళు పెట్టుకుంది. ఇక్కడ ప్రతిరోజూ భయపడుతూ బతుకుతున్నాని, దయచేసి నాలగా ఎవరూ మోసపోవద్దని, ఇక్కడకి రావొద్దని చెప్పింది. దయచేసి ప్రభుత్వ పెద్దలు స్పందించి నన్ను ఇండియాకు చేర్చాలని, లేదంటే చావే శరణ్యం అంటూ రోధించింది.    


Similar News