డంపింగ్ యార్డులా రోడ్డు.. కూతవేటు దూరంలోనే ప్రైవేట్ స్కూల్

కారంపూడి పట్టణ పరిధిలో ఆదినారాయణ కాలనీ , సన్నె గల్లా, కారంపూడి నుంచి దాచేపల్లి వెళ్లే మెయిన్ రోడ్డు వెంబడి పక్కన పేరుకుపోతున్న వ్యర్థాలు. ప్రయాణించాలంటే ప్రజలు ముక్కు మూసుకుని వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Update: 2024-11-14 10:39 GMT

దిశ, కారంపూడి: కారంపూడి పట్టణ పరిధిలో ఆదినారాయణ కాలనీ , సన్నె గల్లా, కారంపూడి నుంచి దాచేపల్లి వెళ్లే మెయిన్ రోడ్డు వెంబడి పక్కన పేరుకుపోతున్న వ్యర్థాలు. ప్రయాణించాలంటే ప్రజలు ముక్కు మూసుకుని వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. మండలంలోని సేకరించిన వ్యర్థాలను రహదారుల పక్కనే పడవేయడంతో ఈ సమస్య ఏర్పడుతుంది. పట్టణ పరిధిలో ఎటు చూసిన రహదారి పక్కన చెత్త వ్యర్థాలు కవర్లు దర్శనమిస్తున్నాయి. రోజుల తరబడి వ్యర్థాలు నిల్వ ఉంటే భరించలేని దుర్వాసన వెదజల్లుతుండటంతో ఈ మార్గంలో రాకపోకలు సాగించాలంటే భయపడుతున్నారు. మేజర్ పంచాయతీల్లో సేకరించిన వ్యర్థాలను ఆటోలు, ట్రాక్టర్ల ద్వారా ఊరికి శివారులో ఉన్న ప్రాంతాలకు తరలించి రోడ్డు పక్కనే పారబోస్తున్నారు. వ్యర్థాలలో వరాహాలు, మూగజీవాలు సంచరింస్తుండటంతో దుర్వాసన వెదజల్లుతోంది.

వ్యర్థాలు అన్నీ రోడ్డు మీదకు జారి రహదారి మొత్తం అపరిశుభ్రంగా తయారవుతోంది. దీనికి ఎదురుగా చికెన్ షాప్ కూడా ఉండటం విశేషం. ఇలాంటి షాప్ నుండి చికెన్ వినియోగిస్తే వద్దు అన్నా రోగాలు ఫ్రీ గా వస్తాయి అని పట్టణ ప్రజలు అంటున్నారు. ఈ వ్యర్థాలపై గ్రామ పంచాయతీ అధికారులు ఇప్పటివరకూ పట్టించుకోవడం లేదు.అనేక పర్యాయాలు అధికారులకు తెలియజేసినా పట్టించుకోక పోవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంటువ్యాధులు ప్రభలు తాయోమోనని ప్రజలు భయపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యలపై దృష్టి పెట్టాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. పంచాయతీ కార్యదర్శికి దిశ రిపోర్టర్ వివరణకు సంప్రదించగా గ్రామ పంచాయతీ ట్రాక్టర్ చెడి పోయింది. అందువల్ల లేటు అవుతుంది. జేసీబీ సాయంతో రెండు రోజుల్లో రోడ్డు పక్కన ఉన్న వ్యర్థాలను క్లీన్ చేస్తాం అని అన్నారు.


Similar News