ఆ జిల్లాలో మూడు జెండాల శోభతో జాతీయ రహదారి?

పల్నాడు జిల్లా చిలకలూరి పేట సమీపంలో నీ బొప్పూడి గ్రామం పసుపు రంగు పులుము కున్నట్టు తయారైంది.దీనికి తగ్గట్టుగానే పక్కనే ఉన్న 5 వ నంబర్ జాతీయ రహదారి కూడా టీడీపీ, జనసేన, బీజేపీ,జెండాలతో కొత్త శోభను సంతరించుకుంది.

Update: 2024-03-17 11:14 GMT

దిశ ప్రతినిధి,గుంటూరు:పల్నాడు జిల్లా చిలకలూరి పేట సమీపంలో నీ బొప్పూడి గ్రామం పసుపు రంగు పులుము కున్నట్టు తయారైంది.దీనికి తగ్గట్టుగానే పక్కనే ఉన్న 5 వ నంబర్ జాతీయ రహదారి కూడా టీడీపీ, జనసేన, బీజేపీ,జెండాలతో కొత్త శోభను సంతరించుకుంది. ఇందుకు ప్రధాన కారణం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం బొప్పుడి కి వస్తున్నారు.ఆయన తో పాటు టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు,జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ లు కూడా వస్తున్నారు. పై మూడు పార్టీలు పొత్తు పెట్టుకుని కలిసి ఏపీ ఎన్నికల్లో పోటీ చేయాలని ఇప్పటికే ఒప్పందం చేసుకున్నారు.ముగ్గురు కలిసి ఇక్కడ జరిగే ప్రజా గళం బహిరంగ సభ నుంచి ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. ఈ సభ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.

సభ కు హాజరయ్యే వారందరి కి స్టేజి పై ఉన్న నాయకులను చూసే విధంగా ఏర్పాటు చేశారు.స్టేజి నీ సుందరంగా అలంకరించారు. రాష్ట్రంలో నలుమూలల నుంచి ఈ సభకు హాజరయ్యేందుకు 3 పార్టీ ల నాయకులు, కార్యకర్తలు వేలాది వాహనాల్లో బొప్పూడి కి బయలు దేరారు. అలాగే 5 వ నంబర్ జాతీయ రహదారి నిండా పై మూడు పార్టీల జెండాలు రెపరెపలు కనిస్తున్నై. సభకు హాజరయ్యే ప్రజానీకానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు.స్టేజి నీ 100 మంది కూర్చునేలా రూపొందించారు.మోడీ,బాబు, పవన్ కళ్యాణ్ ల తో పాటు ఇతర నాయకులు హెలికాప్టర్ లో రానున్నారు.వీటి కోసం 7 హెలిప్యాడ్ నిర్మించారు.జిల్లా కలెక్టర్,ఎస్. పి ఇతర ఉన్నతాధికారులు సభా ప్రాంగణం ప్రాంతాన్ని పరిశీలించారు. భారీ ఎత్తున పోలీసు బలగాలను నియమించారు. జాతీయ రహదారి పై ట్రాఫిక్ ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.సభ 5 గంటలకు ప్రారంభం కానుంది.

Read More..

కాసేపట్లో చిలకలూరిపేట సభకు ప్రధాని మోడీ.. ప్రసంగంపైనే ఉత్కంఠ  

Tags:    

Similar News