Viral Letter: ఇంద్ర దేవుడా వర్షాలు కురిపించవయ్యా.. యూపీ వాసి లేఖ వైరల్..
దక్షణాదిలో వరుణ దేవుడు విజృంభిస్తున్నాడు. కానీ ఉత్తరాదిలో మాత్రం భానుడు భగభగమంటూ నిప్పులు చెరుగుతున్నాడు. దీనితో ప్రజలు తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నారు.
దిశ వెబ్ డెస్క్: దక్షణాదిలో వరుణ దేవుడు విజృంభిస్తున్నాడు. కానీ ఉత్తరాదిలో మాత్రం భానుడు భగభగమంటూ నిప్పులు చెరుగుతున్నాడు. దీనితో ప్రజలు తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా రైతులు వర్షాలు కురవకపోవడంతో పంటలు సాగుచేసేందుకు నీళ్లు లేక, అధికారులు పట్టించుకోక అవస్థలు పడుతున్నారు. కళ్లముందు ప్రజలు ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..? వర్షాలను కురిపించడం సాధ్యంకాదు, కానీ మనసుంటే అటు తాగు నీరు, ఇటు సాగు నీరు లేక అవస్థలు పడుతున్న ప్రజలను ఆదుకోవడానికి ప్రత్యమ్నాయ పద్ధతుల ద్వారా అయినా నీరు అందించే ప్రయత్నం చేయాలి అని అక్కడి ప్రజలు అధికారులను నిలదీస్తూ ఆందోళన చేయలేదు.
సరాసరి తమ సమస్యలను తీర్చాలని దేవుళ్లకే రాజు అయిన ఇంద్రునికి లేఖ రాశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌లోని గోండా జిల్లాకు చెందిన సుమిత్ కుమార్ యాదవ్ అనే రైతు తమ ప్రాంతంలో వర్షం కురవక ప్రజలు తీవ్ర ఇబ్భందులను ఎదుర్కుంటున్నారని, కనుక వెంటనే దేవతల రాజైన ఇంద్రుడిపై చర్యలు తీసుకోవాలి అని లేఖ రాసి,ఇండ్రుడికి వ్యతిరేకంగా ఫిర్యాదును చేస్తూ నరాసిన ఆ లేఖను సంపూర్ణ సమాధాన్ దివస్‌లో 16 జూలై 2022న సమర్పించారు.
అయితే తాను ఇంద్రునిపై ఫిర్యాదు చేసి నెలలు గడుస్తున్నా, వర్షాలు కురవకపోవడంతో తాజగా మరోసారి ఇంద్రపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆ లేఖను కల్నల్‌గంజ్ తహశీల్దార్‌కు అందించారు. కాగా ఆ ఫిర్యాదును స్వీకరించిన తహశీల్దార్ అవసరమైన చర్య కోసం దానిని జిల్లా మేజిస్ట్రేట్‌కు పంపారు. కాగా ఆ లేఖలో