విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం.. చిన్నారి సహా ఇద్దరు దుర్మరణం
విశాఖ జిల్లాలో రోడ్డుపై లారీ అదుపు తప్పి ఎదురుగా ఉన్న స్కూటీని ఢీకొట్టింది...
దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు భారీగా పెరుగుతున్నాయి. ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నా ప్రతి రోజూ ఏదో ఒక చోట యాక్సిండెంట్లు జరుగుతూనే ఉన్నాయి. కారు, బైక్, టాక్టర్, లారీ, బస్సు, తదితర వాహనాలు రోడ్డు ప్రమాదానికి గురవుతున్నాయి. ఈ ప్రమాదాల్లో ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ప్రమాద తీవ్రత బట్టి బతకడం లేదా చనిపోవం జరుగుతున్నాయి. ఇలా రాష్ట్రంలోని రోడ్లు తరచూ రక్తమోడుతున్నాయి.
తాజాగా విశాఖ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. రోడ్డుపై లారీ అదుపు తప్పి ఎదురుగా వెళ్తున్న స్కూటీని ఢీకొట్టింది. ఈ ఘటన దువ్వాడ దగ్గర జరిగింది. ప్రమాదంలో 8 ఏళ్ల చిన్నారి సహా ఇద్దరు మృతి చెందారు. లారీ అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు మృతుల మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. ప్రమాదం సందర్భంగా ఏర్పడిన ట్రాఫిక్ జామ్ ను క్లియర్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వాహనాల అతివేగం వల్లే రోడ్లపై చాలా ప్రమాదాలు జరుగుతున్నాయని పోలీసులు తెలిపారు. ప్రమాదాల నియంత్రించాలంటే వాహనాలు వేగం తగ్గించి నడపాలని సూచించారు. కుటుంబ సభ్యులను దృష్టిలో ఉంచుకుని డ్రైవర్లు వాహనాలు నడపాలని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ రోడ్డు నిబంధనలు పాటించాలని సూచించారు. అతిక్రమిస్తే చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.