ఇళ్లలోకి దూసుకెళ్లిన మామిడికాయల లోడ్ లారీ.. బాలుడు మృతి

విజయవాడలో దారుణ ఘటన జరిగింది. మామిడి కాయలు తీసుకెళ్తున్న లారీ లోడ్ ఫ్లైఓవర్ నుంచి కిందకు దిగుతుండగా ప్రమాదం జరిగింది.

Update: 2023-04-15 05:56 GMT

దిశ, వెబ్ డెస్క్: విజయవాడలో దారుణ ఘటన జరిగింది. మామిడి కాయలు తీసుకెళ్తున్న లారీ లోడ్ ఫ్లైఓవర్ నుంచి కిందకు దిగుతుండగా ప్రమాదం జరిగింది. ఇళ్లలోకి దూసుకెళ్లి బోల్తా పడింది. దీంతో బాలుడు లారీ కింద  మూడేళ్ల బాలుడు చిక్కుకున్నాడు. అది గమనించిన బాధితుడి కుటుంబ సభ్యులు బాలుడిని ఆస్పత్రికి తరలిస్తుండగా అతడు మృతి చెందాడు. బాలుడు మరణించడంతో ఆస్పత్రి దగ్గర బంధువులు ఆందోళన చేపట్టారు. ఈ ఘటనకు కారణం లారీ డ్రైవర్, క్లీనర్ మద్యం మత్తులో ఉండటం వల్ల ప్రమాదం జరిగినట్టు సమాచారం. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.   

Tags:    

Similar News