వివేకా హత్యకేసులో కీలక పరిణామం
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.
దిశ, వెబ్ డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు విచారణను సీబీఐ ఇటీవల హైదరాబాద్ లో స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. అనుబంధ ఛార్జ్ షీట్ పై నేడు సీబీఐ కోర్టు విచారణ జరిపింది. ఈ క్రమంలో ఐదుగురికి సీబీఐ కోర్టు సమన్లు జారీ చేసింది. కేసులో నిందితులుగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, దస్తగిరి, శివశంకర్ రెడ్డిలకు సీబీఐ కోర్టు సమన్లు జారీ చేసింది. వీరు ఫిబ్రవరి 10న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో కోరింది. అయితే ఏపీలో తమకు న్యాయం జరగదని ఈ కేసు విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని వైఎస్ వివేకా కుమార్తె సునీత దేశ అత్యుతన్న న్యాయ స్థానాన్ని ఆశ్రయించగా ఈ కేసును ఇటీవల తెలంగాణకు బదిలీ చేసిన విషయం తెలిసిందే.