రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆలయ కమిటీల్లో ఇక నుంచి వారికి చోటు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం(Andhra Pradesh Govt) కీలక నిర్ణయం తీసుకుంది.
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం(Andhra Pradesh Govt) కీలక నిర్ణయం తీసుకుంది. బుధవారం సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్(AP Cabinet) సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఉచిత గ్యాస్ సిలిండర్‌తో పాటు ఉచిత ఇసుక విధానంలో సీనరేజ్, జీఎస్టీ రద్దుకు ఆమోదం తెలిపింది. శారదపీఠం భూ కేటాయింపుల రద్దుకు ఆమోదం, ఆలయ కమిటీల్లో బ్రాహ్మణులు, నాయీ బ్రాహ్మణులకు అవకాశం కల్పించాలని ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకున్నది. అంతేకాదు.. ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. దీపావళి పండుగ నుంచే ఈ పథకం ప్రారంభించనున్నారు. నాలుగు నెలలకు ఒక సిలిండర్ చొప్పున మొత్తం మూడు సిలిండర్లు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. ఉచిత ఇసుక సరిగా అమలయ్యేలా చూడాలని ఈ సందర్భంగా అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.