Elephants Attack: పంట పొలాలపై ఏనుగుల గుంపు విధ్వంసం
చిత్తూరు జిల్లా(Chittoor District) వీకోట మండలం బోయ చిన్నాగణపల్లె పరిసరాల్లో ఏనుగులు పంట పొలాల(Crop fields)పై స్వైర విహారం(Elephants Attack) చేశాయి.
దిశ, వెబ్ డెస్క్ : చిత్తూరు జిల్లా(Chittoor District) వీకోట మండలం బోయ చిన్నాగణపల్లె పరిసరాల్లో ఏనుగులు పంట పొలాల(Crop fields)పై స్వైర విహారం(Elephants Attack) చేశాయి. ఏనుగుల దాడిలో రైతులకు భారీగా పంట నష్టం వాటిల్లింది. నాయకనేరి అటవీ ప్రాంతంలోని గోభిదోని కుంట అడవి నుండి బోయ చిన్నపల్లి గ్రామ సమీపంలోని పంట పొలంలోకి 10 ఏనుగులతో కూడిన గుంపు ప్రవేశించి పంట పొలాలను తీవ్రంగా నష్టపరిచాయి.
అరటి, కొబ్బరి తోటలు, కూరగాయలు సహా పలు రకాల పంటలతో పాటు డ్రిప్ సిస్టమ్ ను ఏనుగుల గుంపు ధ్వంసం చేసింది. కొంతకాలంగా చిత్తూరు జిల్లాలో గజరాజుల సంచారం ఎక్కువైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే జిల్లాలోని బైరెడ్డిపల్లి మండలం కడతట్లపల్లెలో పంట పొలాలపై ఏనుగుల గుంపు దాడి చేసింది. కోత దశలో ఉన్న అరటి తోటలను ఏనుగుల గుంపు నేలమట్టం చేసింది.