Breaking: తుపాకులతో బిల్డింగ్‌లో నక్కిన దొంగల గ్యాంగ్.. పోలీసుల ఆపరేషన్ పూర్తి
చిత్తూరు టౌన్‌లో దొంగల గ్యాంగ్ హల్ చల్ చేశారు.....
దిశ, వెబ్ డెస్క్: చిత్తూరు టౌన్(Chittoor Town)లో దొంగల గ్యాంగ్(Thieves Gang) హల్ చల్ చేశారు. ఈ రోజు ఉదయం 6.30 గంటలకు గాంధీ రోడ్డులోని భవనంలోకి తుపాకుల(Guns)తో చొరబడ్డారు. స్థానిక షాపు యజమానిపై దాడి చేశారు. ఇంట్లోని కుటుంబాన్ని బెదిరించారు. దీన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు ఆపరేషన్ చేపట్టారు. అయితే భవనంపై నుంచి ఓ దొంగ కిందకు దూకాడు. ఈ ఘటనలో దొంగకు తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఐదుగురు దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు దొంగలు పారిపోయినట్లు సమాచారం.
అయితే భవనం పక్కనున్న ఐడీ బ్యాంకులో దొంగతనం చేసేందుకు దొంగల ముఠా చిత్తూరు టౌన్‌కు వచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దుండగులు నంద్యాల, అనంతపురం, చిత్తూరు వాసులుగా గుర్తించారు. ఈ ఘటనతో చిత్తూరు టౌన్ ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురైంది.