భక్తుడి భారీ విరాళం..ఆ ఆలయంలో బంగారు ధ్వజస్తంభం

అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయంలో ధ్వజస్తంభం స్వర్ణమయమైంది. కాకినాడ జిల్లాల్లోని అవినేటి మండపంలో స్వర్ణ తాపడంతో తయారు చేసిన కవచాన్ని ధ్వజస్తంభానికి అమర్చారు.

Update: 2024-08-09 08:11 GMT

దిశ,వెబ్‌డెస్క్:అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయంలో ధ్వజస్తంభం స్వర్ణమయమైంది. కాకినాడ జిల్లాల్లోని అవినేటి మండపంలో స్వర్ణ తాపడంతో తయారు చేసిన కవచాన్ని ధ్వజస్తంభానికి అమర్చారు. వివరాల్లోకి వెళితే..నెల్లూరుకు చెందిన దాత సహకారం వల్ల రూ. 2 కోట్ల వ్యయం గల బంగారు తాపడంతో నూతన ధ్వజస్తంభాన్ని ప్రతిష్టించినట్లు తెలిపారు. గుంటూరు జిల్లా నిడుబ్రోలు నుంచి తీసుకువచ్చిన నారేప కర్రతో సుమారు 60 అడుగుల ద్వజస్తంభం ఏర్పాటు చేశారు. దీనిపై 300 కేజీల రాగి పై 18 వందల గ్రాముల బంగారు తాపడం చేశారు. అయితే స్తంభానికి అమర్చిన బంగారు రేకుపై అష్టలక్ష్మిలు, దశావతారాలు,  దైవత్వం ఉట్టిపడేలా ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దారు. అనంతరం ధ్వజ స్తంభానికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

Tags:    

Similar News