వాయిదాల పర్వం : చంద్రబాబు కస్టడీ పిటిషన్ పై తీర్పు వాయిదా
విజయవాడ సీఐడీ కోర్టులో చంద్రబాబు నాయుడు కస్టడీ పిటిషన్‌పై తీర్పు మరోసారి వాయిదా పడింది.
దిశ, డైనమిక్ బ్యూరో : విజయవాడ సీఐడీ కోర్టులో చంద్రబాబు నాయుడు కస్టడీ పిటిషన్‌పై తీర్పు మరోసారి వాయిదా పడింది. నేటి మధ్యాహ్నాం 2.30 గంటలకు తీర్పు వెలువరించనున్నట్లు ఏసీబీ కోర్టు జడ్జి తెలిపారు. శుక్రవారం ఉదయం 10:30గంటలకు కస్టడీ పిటిషన్‌పై తీర్పుపై న్యాయమూర్తి చర్చించారు. నేటి మధ్యాహ్నం 1.30కు చంద్రబాబు నాయుడు క్వాష్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టు తీర్పు వెల్లడించే అవకాశం ఉందని చంద్రబాబు తరఫు న్యాయవాదులు జడ్జి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఏసీబీ కోర్టు జడ్జి తీర్పును మధ్యాహ్నాంకు వాయిదా వేశారు. చంద్రబాబు నాయుడు కస్టడీ పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో వాదనలు ముగిశాయి. బుధవారం సీఐడీ తరఫున ఏఏజీ పొన్నవోలు సుధాకర రెడ్డి, చంద్రబాబు నాయుడు తరఫున సిద్ధార్థ లూథ్రా, సిద్ధార్థ అగర్వాల్‌లు సుదీర్ఘంగా వాదనలు వినిపించిన సంగతి తెలిసిందే. అయితే తీర్పుపై మాత్రం ఏసీబీ కోర్టు రిజర్వు చేశారు. క్వాష్ పిటిషన్‌పై తీర్పు వెల్లడించాల్సి ఉన్న నేపథ్యంలో తీర్పును వాయిదా వేస్తున్నారు. అయితే శుక్రవారం కస్టడీ పిటిషన్‌పై తీర్పు వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.