Tirumala: తిరుమల నడకదారిలో మరోసారి చిరుత కలకలం..

తిరుమల నడకదారిలో మరోసారి చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది.

Update: 2024-03-28 03:48 GMT

దిశ తిరుమల: తిరుమల నడకదారిలో మరోసారి చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది. గత ఏడాది తిరుమల కాలినడక మార్గంలో చిరుత దాడిలో ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయిన విషయం అందరికి తెలిసిందే. ఇక ఆ ఘటనతో టిటిడి అధికారులు అప్రమత్తమయ్యారు. నడక మార్గంలో చిరుత సంచరించే ప్రాంతాల్లో ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసి చిరుతపులులను బంధించడం జరిగింది.

 

అలానే కాలి నడకన తిరుమల వెళ్లే భక్తుల భద్రతను దృష్టిలో పెట్టుకుని బృందాలుగా ఏర్పాటు చేసి, వారి చేతికి కర్రలను అందించి మెట్లు మార్గంలోకి అనుమతిస్తున్నారు. ఈ నేపథ్యంలో మరో సారి చిరుత సంచరించడం కలకలం రేపింది. ఈనెల 26వ తేదీ వేకువ జామున 12 గంటల సమయంలోట్రాప్ కెమెరాలకు చిరుతపులి కదలికలు చిక్కడంతో మరోసారి భద్రతా సిబ్బందిని టీటీడీ అప్రమత్తం చేసింది. తిరుమలలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ అధికారులు భద్రతా ఏర్పాట్లు చేశారు.

 

Tags:    

Similar News