CM Chandrababu:‘రేపు స్వాతంత్య్ర దినోత్సవం’..ప్రతి ఇంటి పై జాతీయ జెండా రెపరెపలాడాలని పిలుపు

దేశంలో రేపు (ఆగస్టు 15) 78వ స్వాతంత్య్ర దినోత్సవం ఘనంగా జరుపుకుంటారు. మువ్వన్నెల జెండాను ఎగురవేసి జాతీయ గీతం ఆలకించుతారు.

Update: 2024-08-14 11:05 GMT

దిశ,వెబ్‌డెస్క్:దేశంలో రేపు (ఆగస్టు 15) 78వ స్వాతంత్య్ర దినోత్సవం ఘనంగా జరుపుకుంటారు. మువ్వన్నెల జెండాను ఎగురవేసి జాతీయ గీతం ఆలకించుతారు. ఈ క్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు ప్రజలకు ముందుస్తు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియాలో 'హర్ ఘర్ తిరంగా' కార్యక్రమాన్ని ప్రస్తావించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ..ప్రధాని నరేంద్ర మోడీ ‘హర్ గర్ తిరంగా’ కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటి పై జాతీయ జెండాను ఎగుర వేయడం గర్వకారణమన్నారు.

ఇది దేశ సమగ్రతకు కాపాడుతుంది. ఈ కార్యక్రమం వరుసగా మూడు సంవత్సారులు అవుతుందన్నారు. 'ఇంటింటా జాతీయ జెండా' అనే ఈ కార్యక్రమం మరింత విస్తరించడం ఆనందకర విషయామని తెలిపారు. మన తెలుగువాడైన పింగళి వెంకయ్య రూపొందించిన త్రివర్ణపతాకం జాతీయ జెండా రూపంలో ప్రతి ఇంటిపై ఎగరడం మనకు గర్వకారణం. ఈ నేపథ్యంలో రేపు ప్రతి ఇంటిపై, ప్రతి కార్యాలయంపై మన మువ్వన్నెల జాతీయ జెండాను రెపరెపలాడించండి అని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు.

Tags:    

Similar News