మాజీ మంత్రి కొడాలి నానికి షాక్.. 9 మంది అనుచరులు అరెస్ట్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ మంత్రి కొడాలి నాని అనుచరులు అయిన 9 మందిని ఈ రోజు పోలీసులు అరెస్ట్ చేశారు.

Update: 2024-12-04 09:18 GMT

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ మంత్రి కొడాలి నాని(Former Minister Kodali Nani) అనుచరులు అయిన 9 మందిని ఈ రోజు పోలీసులు అరెస్ట్(arrest) చేశారు. వీరు 2022 సంవత్సరం డిసెంబర్ నెలలో.. టీడీపీ(TDP) మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు కు చెందిన ఓ షాప్ పై దాడి చేశారు. ఈ దాడిలో పెట్రోలో ప్యాకెట్లను ఉపయోగించడంతో సదరు షాప్ పూర్తిగా ధ్వంసం అయింది. దీంతో ఈ ఘటనకు కారణమైన వారిపై అప్పుడే ఫిర్యాదు చేయగా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసులో భాగంగా ప్రధాన నిందితులుగా ఉన్న 9 మందిని అరెస్ట్ చేసి పెదపారుపూడి స్టేషన్ కు తరలించారు. ఇదే కేసులో మాజీ మంత్రి కొడాలి నాని ప్రధాన అనుచరుడు అయిన కాలీ పరారీలో ఉండగా.. అతని కోసం పోలీసులు ప్రత్యేక బృందంగా ఏర్పడి గాలిస్తున్నారు.


Similar News