Savings societies: పురుషులకూ.. పొదుపు సంఘాలు.. విజయవాడ, విశాఖలో 818 గ్రూపులు

కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పురుషుల‌కు స్వయం స‌హాయ‌క సంఘాల గ్రూపులు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి పొంగూరి నారాయణ వెల్లడించారు

Update: 2025-03-18 10:52 GMT
Savings societies: పురుషులకూ.. పొదుపు సంఘాలు.. విజయవాడ, విశాఖలో 818 గ్రూపులు
  • whatsapp icon

దిశ డైనమిక్ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పురుషుల‌కు స్వయం స‌హాయ‌క సంఘాల గ్రూపులు (Self help groups) ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి పొంగూరి నారాయణ (Minister narayana) వెల్లడించారు. పురుషుల‌కు స్వ‌యం స‌హాయ‌క సంఘాల ఏర్పాటుపై అసెంబ్లీలో మంత్రి సమాధానం ఇచ్చారు. మ‌హిళా గ్రూపుల‌కు ఉన్న త‌ర‌హాలోనే పురుషుల‌కు కూడా స్వయం స‌హాయ‌క సంఘాల విధివిధానాలు ఉంటాయని తెలిపారు. ఏపీలో విజ‌య‌వాడ‌, విశాఖలో పురుషుల‌కు ఈ స్వయం సహాకయ గ్రూపులుఉన్నాయని వివరించారు. ఏప్రిల్ 2025 నాట‌కి అన్ని న‌గ‌రాల్లో వ‌ర్తింపచేసే ఆలోచ‌న‌లో కేంద్రం ఉన్నట్లు తెలుస్తుందన్నారు. బ‌ల‌హీన వ‌ర్గాలకు చెందిన పురుషుల‌కు మాత్రమే ఈ గ్రూపుల్లో చేరే అర్హత ఉంటుందన్నారు. విశాఖ‌, విజ‌య‌వాడ‌లో ఇప్పటి వరకు 818 గ్రూపులు ఏర్పాట‌య్యాయి. దేశ‌వ్యాప్తంగా ఇత‌ర న‌గ‌రాల్లో 1949 మాత్రమే ఏర్పాటు చేస్తే ఏపీలో కేవ‌లం రెండు న‌గ‌రాల్లోనే 818 గ్రూపులు ఏర్పాటు చేశామని ఆయన వివరించారు.

ఏమిటి పొదుపు సంఘాలు..?

కేంద్ర ప్రభుత్వం ఆరు రకాల గ్రూపులను ఈ స్వయం పొదుపు సంఘాలలో చేరెందుకు విధివిధానాలు రూపొందించింది. అందులో మొదటిది భవన నిర్మాణ రంగంలో పనిచేసేవారు, ఆ తర్వాత కేర్ వర్కర్స్, గిగ్ వర్కర్స్, ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఉంటారు. ఈ విధంగా అసంఘటిత రంగాలలో పనిచేసే కార్మికులు (Lbour), సిబ్బందితో పురుషులకు సంఘాలను ఏర్పాటు చేస్తారు. ఐదుగురు కలిసి ఒక గ్రూపుగా ఏర్పాటు కావచ్చు. స్థానికంగా ఉండే మెప్మా సిబ్బంది, సచివాలయ సిబ్బందిని కలిసి బ్యాంకు ఖాతాలను తెరవాలి. పురుషుల పొదుపు సంఘాలకు బ్యాంకు నుంచి ఏడు శాతం వడ్డీతో రుణాలు ఇస్తారు. ఈ పొడుపు సంఘాలకు ఆదరణ పెరుగుతోంది.

Tags:    

Similar News