ఇన్సూరెన్స్ ఉన్నా లేకున్నా బోటుకు 80శాతం పరిహారం ఇవ్వాల్సిందే: విశాఖ ఘటనపై సీఎం జగన్
మత్స్యకారుల సంక్షేమం పట్ల ప్రభుత్వం ఎంతో చిత్తశుద్ధితో పనిచేస్తుందని సీఎం వైఎస్ జగన్ అన్నారు.
దిశ , డైనమిక్ బ్యూరో : మత్స్యకారుల సంక్షేమం పట్ల ప్రభుత్వం ఎంతో చిత్తశుద్ధితో పనిచేస్తుందని సీఎం వైఎస్ జగన్ అన్నారు. విశాఖపట్నంలో జరిగిన ఘటనలో 40 బోట్లు కాలిపోయాయని తమ దృష్టికి వస్తే వెంటనే వాళ్లని ఆదుకోవాలని తపన, తాపత్రయం పడ్డామని సీఎం జగన్ తెలిపారు. అంతర్జాతీయ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాల్లో జీవనోపాధి కోల్పోయిన 23,458 కుటుంబాలకు రూ.161.86 కోట్ల నిధులను సీఎం వైఎస్ జగన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడారు. కాలిపోయిన బోట్లకు ఇన్సూరెన్స్ ఉందా ? లేదా ? అని విచారణ చేసి ఇన్సూరెన్స్ లేదని తెలిసిన వెంటనే ఎట్టిపరిస్థితుల్లోనూ ఆ మత్స్యకార కుటుంబాలకు నష్టం జరగకూడదని.. వాళ్లకు మేలు చేయాలని, ప్రతి బోటు విలువ లెక్కగట్టి ఆ బోటుకు సంబంధించి 80 శాతం ప్రభుత్వమే ఇచ్చేట్టుగా వెంటనే ఆదేశాలు జారీ చేశామని సీఎం జగన్ వెల్లడించారు. ఆ చెక్కులు ఈరోజే పంపిణీ చేయాలని మంత్రులు, అధికారులను ఆదేశించామన్నారు. ప్రతి విషయంలో మనసుపెట్టి అన్ని రకాలుగా మత్స్యకారులకు మన ప్రభుత్వం తోడుగా ఉందని సీఎం వైఎస్ జగన్ తెలిపారు.
Read More..
ఏపీలో వారికి తీపికబురు.. ఒక్కొక్కరి ఖాతాలో రూ.69వేలు జమ చేసిన జగన్
బోట్లు కోల్పోయిన మత్స్యకారులకు పవన్ కల్యాణ్ అండ.. ఒక్కొక్కరికి రూ.50వేలు సాయం