Sankranti Buses: సంక్రాంతికి తెలంగాణ నుండి ఏపీకి 2,400 ప్రత్యేక బస్సులు
సంక్రాంతి(Sankranti) పండుగ సందర్భంగా హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ (Hyderabad to Andhra Pradesh) వెళ్లే వారి కోసం తెలంగాణ నుండి అదనంగా ఏపీకి 2,400 ప్రత్యేక బస్సులు నడుపనున్నట్లుగా ఏపీఎస్ ఆర్టీసీ(APSRTC) తెలిపింది.
దిశ, వెబ్ డెస్క్ : సంక్రాంతి(Sankranti) పండుగ సందర్భంగా హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ (Hyderabad to Andhra Pradesh) వెళ్లే వారి కోసం తెలంగాణ నుండి అదనంగా ఏపీకి 2,400 ప్రత్యేక బస్సులు నడుపనున్నట్లుగా ఏపీఎస్ ఆర్టీసీ(APSRTC) తెలిపింది. ఎలాంటి అదనపు చార్జీలు లేకుండా ప్రత్యేక బస్సులు నడపనున్నామని ఏపీఎస్ఆర్టీసీ వెల్లడించింది. సంక్రాంతి ప్రత్యేక బస్సు సర్వీస్ లు జనవరి 9 నుంచి 13 వరకు అందుబాటులో ఉండనున్నాయని పేర్కొంది. కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ఒంగోలు, మాచర్లతో సహా ఏపీలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే సాధారణ, ప్రత్యేక బస్సులు ఎంజీబీఎస్(MGBS)కి నేరుగా ఎదురుగా ఉన్న గౌలిపురలోని పాత సెంట్రల్ బస్ స్టేషన్ (CBS) నుండి బయలుదేరనున్నాయి.
తాజాగా తెలంగాణ ఆర్టీసీ(TGHyderabad to Andhra Pradesh) అధికారులు కూడా కీలక నిర్ణయం తీసుకున్నారు. సంక్రాంతి పండక్కి 5 వేల ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు చెప్పారు. ఈ బస్సులను తెలంగాణ జిల్లాలతో పాటుగా.. ఏపీలోని పలు ప్రాంతాలకు నడపనున్నారు. జనవరి మొదటి వారం నుంచి 10 రోజుల పాటు ఈ బస్సులు నడుస్తాయని తెలిపాయి. అయితే ఈ బస్సులు ఏయే రూట్లలోనే నడుస్తాయనే అశంపై త్వరలోనే క్లారిటీ ఇస్తామన్నారు. సిటీ నుంచి విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, విశాఖపట్నం, నెల్లూరు వంటి రూట్లలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని 3 వేలకు పైగా అదనపు బస్సులు నడపాలని ఆర్టీసీ భావిస్తున్నట్టు సమాచారం.