AP News:రాజధానికి రూ.15 వేల కోట్లు..మంత్రి సత్యకుమార్ ఆసక్తికర ట్వీట్!
లోక్‌సభలో నేడు 2024-2025 వార్షిక బడ్జెట్‌ను కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మాల సీతారామన్ ప్రవేశపెట్టారు.
దిశ,వెబ్‌డెస్క్: లోక్‌సభలో నేడు 2024-2025 వార్షిక బడ్జెట్‌ను కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మాల సీతారామన్ ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ సమావేశంలో రాజధాని నిర్మాణానికి రూ.15 వేల కోట్లు కేటాయించినట్లు నిర్మాల సీతారామన్ తెలిపారు. ఈ నేపథ్యంలో ఏపీ రాజధాని అమరావతికి కేంద్ర ప్రభుత్వం రూ.15 వేల కోట్లు కేటాయించడం పై మంత్రి సత్య కుమార్ యాదవ్ హర్షం వ్యక్తం చేశారు. ‘ఏపీ ప్రజల కలల రాజధాని నిర్మాణం కోసం స్పెషల్ సపోర్ట్ కింద కేంద్ర బడ్జెట్‌లో ఈ ఏడాదికి గానూ రూ.15,000 కోట్లు కేటాయించిన ప్రధాని మోడీ, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం కట్టుబడి ఉంది’ అని మంత్రి ట్వీట్టర్ వేదికగా తెలిపారు.