నేడే ఏపీ పంచాయతీ ఎన్నికల పోలింగ్.. వెంటనే ఫలితాలు విడుదల

దిశ,వెబ్‌డెస్క్:ఏపీలో తొలిదశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. మంగళవారం ఉదయం 6.30గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ఈ పోలింగ్ మధ్యాహ్నం 3.30 గంటల వరకు కొనసాగనుంది. పోలింగ్‌ ముగిసిన వెంటనే అక్కడే సాయంత్రం 4గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపడతారు. 12 జిల్లాల పరిధిలో జరగనున్న నేపథ్యంలో 2,723 సర్పంచి, 20,157 వార్డు సభ్యులకు ఎన్నికల జరగుతున్నట్లు పంచాయతీరాజ్‌ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది చెప్పారు. తొలివిడతలో 3,249 గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా నోటిఫికేషన్లు జారీ […]

Update: 2021-02-08 20:49 GMT

దిశ,వెబ్‌డెస్క్:ఏపీలో తొలిదశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. మంగళవారం ఉదయం 6.30గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ఈ పోలింగ్ మధ్యాహ్నం 3.30 గంటల వరకు కొనసాగనుంది. పోలింగ్‌ ముగిసిన వెంటనే అక్కడే సాయంత్రం 4గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపడతారు. 12 జిల్లాల పరిధిలో జరగనున్న నేపథ్యంలో 2,723 సర్పంచి, 20,157 వార్డు సభ్యులకు ఎన్నికల జరగుతున్నట్లు పంచాయతీరాజ్‌ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది చెప్పారు. తొలివిడతలో 3,249 గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా నోటిఫికేషన్లు జారీ చేయగా 525 చోట్ల సర్పంచి ఎన్నిక ఏకగ్రీవమైనట్లు చెప్పారు.

Tags:    

Similar News