అనంతపురంలో జూడాల తిరుగుబాటు

అనంతపురం జిల్లా గవర్నమెంట్ జనరల్ ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్లు తిరుగుబావుటా ఎగురవేశారు. కరోనా విస్తృతమవుతున్న ప్రస్తుత తరుణంలో మాస్క్‌లు, పీపీఈ కిట్స్‌ అందజేయకుంటే విధులు నిర్వహించలేమని స్పష్టం చేశారు. ఐసోలేషన్ వార్డుల్లో పని చేస్తున్న సిబ్బందికి తప్ప ఇతరులకు రక్షణ సామగ్రి అందజేమలేమని అధికారులు ప్రకటించిన నేపథ్యంలో జూడాలు విధులు బహిష్కరించారు. దీంతో అధికారులు వారితో చర్చలు జరుపుతున్నారు. కాగా, సరైన రక్షణ సామగ్రి ధరించి వైద్యమందించని కారణంగా కరోనా రోగులకు సేవలందించిన ఇద్దరు వైద్యులు, నలుగురు […]

Update: 2020-04-09 03:41 GMT

అనంతపురం జిల్లా గవర్నమెంట్ జనరల్ ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్లు తిరుగుబావుటా ఎగురవేశారు. కరోనా విస్తృతమవుతున్న ప్రస్తుత తరుణంలో మాస్క్‌లు, పీపీఈ కిట్స్‌ అందజేయకుంటే విధులు నిర్వహించలేమని స్పష్టం చేశారు. ఐసోలేషన్ వార్డుల్లో పని చేస్తున్న సిబ్బందికి తప్ప ఇతరులకు రక్షణ సామగ్రి అందజేమలేమని అధికారులు ప్రకటించిన నేపథ్యంలో జూడాలు విధులు బహిష్కరించారు. దీంతో అధికారులు వారితో చర్చలు జరుపుతున్నారు. కాగా, సరైన రక్షణ సామగ్రి ధరించి వైద్యమందించని కారణంగా కరోనా రోగులకు సేవలందించిన ఇద్దరు వైద్యులు, నలుగురు సిబ్బందికి కరోనా సోకింది. ఈ నేపథ్యంలోనే తమకు రక్షణ సామగ్రి కావాలని జూనియర్ డాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు.

Tags: corona virus, covid-19, anantapuram, ggh, jonior doctors, masks, ppe kits

Tags:    

Similar News